ఏపీ ఎన్జోవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జోవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మకు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. పార్టీ గౌరవ అధ్మక్షురాలితో పాటు పార్టీ నేతల మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొనేందుకు విజయమ్మ, పార్టీ నేతలు ఈరోజు ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే.