నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌ | Ys Jagan to Visit Pulivendula | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

May 14 2019 8:43 AM | Updated on May 14 2019 9:08 AM

Ys Jagan to Visit Pulivendula - Sakshi

సాక్షి, పులివెందుల : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రికి హైదరాబాద్‌ నుంచి పులివెందులకు చేరుకుంటారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 8.30గంటలకు తమ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో మమేకమవుతారు. సాయంత్రం పులివెందుల పట్టణంలోని వీజే ఫంక్షన్‌ హాలులో ముస్లింలతో కలిసి ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. 16వ తేదీ (గురువారం) ఉదయం నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement