వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర నమస్కారం! | YS Jagan Mohan Reddy, Chandrababu Naidu greeted each other at Governors Iftaar | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర నమస్కారం!

Jul 23 2014 7:37 PM | Updated on Sep 5 2018 8:33 PM

వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర నమస్కారం! - Sakshi

వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర నమస్కారం!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరస్పరం ఎదురుపడి నమస్కారం చేసుకున్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరస్పరం ఎదురుపడి నమస్కారం చేసుకున్నారు. ఈ సంఘటన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందులో చోటు చేసుకుంది. ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ విందుకు కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. 
 
ఈ విందులో పలు రాజకీయపార్టీలకు చెందిన నేతలు పరస్పరం పలకరించుకోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, స్పీకర్ కోడెల, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మండలి చైర్మన్లు కూడా హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement