ముంపు, పంట నష్టాలపై వైఎస్ జగన్ ఆరా | YS jagan enquiry on Crop losses with MLA balaraju | Sakshi
Sakshi News home page

ముంపు, పంట నష్టాలపై వైఎస్ జగన్ ఆరా

Oct 25 2013 3:40 AM | Updated on Jul 25 2018 4:09 PM

అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో ఏర్పడిన ముంపు, పంట నష్టాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఆరా తీశారు.

ఏలూరు, న్యూస్‌లైన్ : అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో ఏర్పడిన ముంపు, పంట నష్టాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఆరా తీశారు. పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు వైఎస్ జగన్ ఫోన్‌చేసి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకూ సం భవించిన పంట, ఆస్తి నష్టాలను బాలరాజు ఆయనకు వివరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల డెల్టాలో వరికి తీవ్ర నష్టం ఏర్పడిందని బాలరాజు తెలిపారు.

ఎర్రకాలువ పొంగటం వల్ల మెట్ట ప్రాంతంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఏజెన్సీలో పొగాకు రైతులకు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్పందించిన వైఎస్ జగన్ కష్టకాలంలో ఉన్న రైతులు, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement