కాలినడకన తిరుమలకు వైఎస్‌ జగన్‌

YS Jagan Begins Walk to Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం అలిపిరి చేరుకున్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడిలా కాలినడకన తిరుమలకు బయలు దేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించారు. సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు. ఆయన వెంట తిరుమల వెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణతో ముందుకు సాగుతున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ శ్రేణులను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని వైఎస్‌ జగన్‌ దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top