
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 329వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలంలోని నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్, నర్సింగపల్లి, జగన్నాధపురం వరకు పాదయాత్ర సాగుతుంది.
మధ్యాహ్నాం 12 గంటలకు లంచ్ విరామం తీసుకుంటారు. భోజనం అయిన తర్వాత సుమారు మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర పున: ప్రారంభిస్తారు. కుంచుకోట మీదుగా పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. జాంతూరు క్రాస్, బండపల్లి, కొత్తూరు క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు. ఈ మేరకు ఏపీ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.
ముగిసిన 328వ రోజు పాదయాత్ర
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 328వ రోజు 6.9 కిలోమీటర్లు నడిచారు. రావివలస, నౌపాడ క్రాస్, జయకృష్ణాపురం, గోపినాథపురం మీదుగా టెక్కలి వరకు ప్రజాసంకల్పయాత్ర సాగింది. పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్ 3,505.6 కిలోమీటర్లు నడిచారు.