ఎమ్మెల్యే కారు ఢీ: యువకుడు మృతి | Youth killed in car accident at East Godavari District | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారు ఢీ: యువకుడు మృతి

Apr 24 2014 10:32 AM | Updated on Sep 18 2019 3:26 PM

తూర్పు గోదావరి జిల్లాలో పి.గన్నవరం మండలం మొండెపు లంక వద్ద స్థానిక ఎమ్మెల్యే పి.రాజేశ్వరీ దేవి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది.

తూర్పు గోదావరి జిల్లాలో పి.గన్నవరం మండలం మొండెపు లంక వద్ద స్థానిక ఎమ్మెల్యే పి.రాజేశ్వరీ దేవి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందితోపాటు స్థానికుల సహాయంతో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement