‘పసుపు’ మద్యం స్వాధీనం | 'Yellow' possession of alcohol | Sakshi
Sakshi News home page

‘పసుపు’ మద్యం స్వాధీనం

Apr 4 2014 1:57 AM | Updated on Aug 21 2018 5:46 PM

టీడీపీ నాయకులు అక్రమంగా నిల్వ ఉంచిన *96 వేల విలువైన మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వడమాలపేట, న్యూస్‌లైన్: టీడీపీ నాయకులు అక్రమంగా నిల్వ ఉంచిన *96 వేల విలువైన మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాదిరేడు గ్రామ సర్పంచు హేమాద్రినాయుడు తమ్ముడు రావిళ్ల కృష్ణమనాయుడు, లక్ష్మీపురం గ్రామం లో బాబునాయుడు ఇళ్లలో ఎన్నికల కోసం మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో రేణిగుంట ట్రైనీ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపారు. పాదిరేడులో హనీబీ 14 కేసులు (700 క్వార్టర్ బాటిళ్లు), లక్ష్మీపురంలో ఎంసీ బ్రాందీ ఆరు కేసులు (280 క్వార్టర్ బాటిళ్లు) సీజ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement