ఇటీవల వరుస తుఫాన్లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు
ఇటీవల వరుస తుఫాన్లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ బుధవారం పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లాకు పయనమైయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పలుప్రాంతాల్లో వైఎస్ జగన్ నిన్న పర్యటించారు. నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్ ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు.