పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం | women suisise attempt in front of police station | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Jun 14 2015 3:16 AM | Updated on Aug 21 2018 9:20 PM

పట్టణంలోని కొత్త మసీదు ప్రాంతానికి చెందిన రమీజాబీ శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆళ్లగడ్డ టౌన్ : పట్టణంలోని కొత్త మసీదు ప్రాంతానికి చెందిన రమీజాబీ శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రమీజాబీ చీటీల వ్యాపారం చేస్తుండేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి చీటీ పాడాడు. పాట పాడి చాలా రోజులైనా చీటీ డబ్బులు ఇవ్వక ఇదిగో అదిగో అంటూ చెబుతుండటంతో ఆ వ్యక్తితో పాటు చీటీ భాగస్తులందరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రమీజాబీని పోలీస్ స్టేషన్‌కు పిలిపించడంతో అవమానంగా భావించి స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగింది. గమనించిన  బంధువులు ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement