మహిళా క్రికెటర్ ఆత్మహత్య | women cricketer durgabhavani commits suicide in vijayawada | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెటర్ ఆత్మహత్య

Oct 11 2015 7:28 PM | Updated on Nov 6 2018 7:56 PM

విజయవాడలో ఆదివారం మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ దుర్గా భవాని ఆత్మహత్యకు పాల్పడింది.

విజయవాడ: విజయవాడలో ఆదివారం మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ దుర్గా భవాని ఆత్మహత్యకు పాల్పడింది. సౌత్ జోన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న దుర్గాభవాని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, కొద్దిరోజులుగా దుర్గా భవాని, ఆమె భర్త మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చాముండేశ్వరినాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నారని దుర్గాభవాని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. దుర్గాభవానికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఐతే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement