గెలిచినా, ఓడినా.. ఎన్నికల తర్వాత..: జైరాం | Win or lose, generational change in Congress after poll: Jairam Ramesh | Sakshi
Sakshi News home page

గెలిచినా, ఓడినా.. ఎన్నికల తర్వాత..: జైరాం

Apr 28 2014 3:03 PM | Updated on Mar 18 2019 9:02 PM

గెలిచినా, ఓడినా.. ఎన్నికల తర్వాత..: జైరాం - Sakshi

గెలిచినా, ఓడినా.. ఎన్నికల తర్వాత..: జైరాం

2014 ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నా.. యువకులకు పెద్ద పీట వేస్తామన్నారు.

హైదరాబాద్: గెలిచినా.. ఓడినా కాని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులుంటాయని కేంద్రమంత్రి జైరాం రమేశ్ తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి యువరక్తం ఎక్కిస్తామని ఆయన అన్నారు.
 
2014 ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నా.. యువకులకు పెద్ద పీట వేస్తామన్నారు. 30, 40 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్ధులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిందని జైరాం తెలిపారు.
 
యువకుతో కూడిన నూతన కాంగ్రెస్ ప్రజలకు చేరువవుతుందని జైరాం అన్నారు. జనరేషన్ మార్పు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా.. వందశాతం అని జైరాం బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement