జనవరి 3న అసెంబ్లీ ముట్టడి: ఉద్యోగ సంఘాలు | will assembly Obsession on January 3, employees Union | Sakshi
Sakshi News home page

జనవరి 3న అసెంబ్లీ ముట్టడి: ఉద్యోగ సంఘాలు

Dec 28 2013 6:27 PM | Updated on Sep 2 2017 2:04 AM

మధ్యంతర భృతి చెల్లింపులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

హైదరాబాద్: మధ్యంతర భృతి చెల్లింపులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించాయి. శనివారం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కిరణ్ కుమార్రెడ్డితో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.  సీఎం కిరణ్ ను 45శాతం ఐర్(మధ్యంతర భృతి)ను కోరామని చెప్పారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ ను  సీఎం కిరణ్ ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో సీఎం కిరణ్ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

ఇందుకు నిరసనగా జనవరి 3న చలో అసెంబ్లీని నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. కాగా, ఈ సమావేశంలో ఇవాళ ఉద్యోగుల హెల్త్‌ కార్డులపైనే చర్చ జరిగిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కాగా, నాలుగైదు రోజుల్లో చర్చలకు మళ్లీ పిలుస్తామని కిరణ్కుమార్ రెడ్డి చెప్పినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement