జాబు ఎప్పుడిస్తావ్? | when did give job ? | Sakshi
Sakshi News home page

జాబు ఎప్పుడిస్తావ్?

Feb 20 2015 2:26 AM | Updated on Jul 28 2018 3:23 PM

సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగులకు వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాక వారికి ఇచ్చిన హామీలను

వైఎస్‌ఆర్‌సీపీ విదార్థి విభాగం జిల్లా అధ్యక్షుడి డిమాండ్
 
తిరుపతి తుడా: సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగులకు వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాక వారికి ఇచ్చిన హామీలను విస్మరించారని వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తూ ఎస్వీయూ ప్రకాశం భవనం వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం కోసం నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి ఇప్పుడు ఉన్నజాబుల్ని ఊడగొడుతున్నారని ఎద్దేవా చేశారు.

అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి అందలేదన్నారు. హామీలను నెరవేర్చకుంటే విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం నాయకులు హేమంత్‌కుమార్, మురళీధర్, సుధీర్‌రెడ్డి, రవీంద్రనాయక్, చైతన్య, కిషోర్, నాగరాజునాయక్, నవీన్‌కుమార్‌గౌడ్, బషీర్, సురేష్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement