తెలంగాణ ప్రకటనపై దేశ రాజధానిలో పెద్దఎత్తున మంతనాలు సాగుతున్న తరుణంలో టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఫాం హౌస్‌లో కూర్చుని ఏం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రకటనపై దేశ రాజధానిలో పెద్దఎత్తున మంతనాలు సాగుతున్న తరుణంలో టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఫాం హౌస్‌లో కూర్చుని ఏం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ పార్టీని పదేపదే విమర్శించినంత మాత్రాన తెలంగాణ వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ - టీఆర్‌ఎస్‌లకు మధ్య ఉన్న ‘బంధం’ ఏమిటో చెప్పాలని నిలదీశారు. బీజేపీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎన్.రామచంద్రరావు తదితరులు బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే పార్లమెంటుకు వెళ్లి తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టాలని సవాల్ చేశారు.