‘కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం’ | wer are scientifically studied in kapu reservations, says justice manjunath | Sakshi
Sakshi News home page

‘కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం’

Jul 21 2017 3:07 PM | Updated on Sep 5 2017 4:34 PM

‘కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం’

‘కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం’

కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నామని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ్‌ తెలిపారు.

విజయవాడ: కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నామని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. నివేదిక తుది దశలో ఉందని, అయితే తాము సమర్పించే నివేదికపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదని, 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్‌ జిల్లాల్లో పర్యటించిందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవన విధానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు యత్నిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement