'ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొంటాం' | we will face chandrbabu tyranny in democratic way says ysrcp leaders | Sakshi
Sakshi News home page

'ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొంటాం'

Apr 5 2015 3:35 PM | Updated on Aug 20 2018 6:35 PM

అనంతలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు శంకరనారయణ, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు మండిపడ్డారు.

అనంతపురం: అనంతలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు శంకరనారయణ, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొంటామని తెలిపారు. హంద్రీనీవ ప్రాజెక్ట్ను ఏడాదిలోగా పూర్తిచేస్తామని బాలకృష్ణ, పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఎందుకు నోరు మెదపలేదు అని ప్రశ్నించారు.

 

పట్టిసీమద్వారా రాయలసీమకు నీరందిస్తామని ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. కానీ జీవోలో ఎందుకు స్పష్టంగా హామీ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. అనంతలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement