జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు

జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు - Sakshi


హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు  కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)కు తాము ఎటువంటి నివేదిక ఇవ్వం అని ఆ లేఖలో తెలిపారు.రాష్ట్ర విభజనను సిపిఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి, ఎంఐఎం, సిపిఎం మూడు పార్టీలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top