ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి తొలి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఫిబ్రవరి తొలి వారంలోనే ఓటాన్ అకౌంట్!
Jan 30 2014 2:34 AM | Updated on Sep 27 2018 5:59 PM
సాక్షి, హైదరాబాద్: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి తొలి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు గడువును పొడిగించని పక్షంలో గురువారమే అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. అయితే ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉన్నందున అప్పటిదాకా సభను కొనసాగించనున్నారు. ఆ లోగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కూడా ఆమోదించనున్నారు. బిల్లుపై చర్చకు గడువు గురువారంతో ముగిసిన తరువాత ప్రభుత్వం పేర్కొన్న తేదీకి సభను వాయిదా వేయనున్నారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement