బైక్, ఆటో ఢీ: ఇద్దరు మృతి | Violent Collision Involving Motorcycle, auto Leaves 2 Dead | Sakshi
Sakshi News home page

బైక్, ఆటో ఢీ: ఇద్దరు మృతి

Jul 26 2015 2:20 PM | Updated on Sep 3 2017 6:13 AM

లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్రవాహనం పక్కనుంచి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.

వైఎస్సార్ జిల్లా: లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్రవాహనం పక్కనుంచి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట జాతీయరహదారిపై ఆదివారం జరిగింది. వివరాలు.. కోడూరు గ్రామానికి చెందిన సోమశేఖర్(24) రాజంపేటకు చెందిన ఆంజనేయులు(28) ఇద్దరు రాజంపేట నుంచి కోడురుకు శుభకార్యానికి హాజరు కావడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మంగంపేట సమీపానికి రాగానే.. లారీని ఓవర్‌టేక్ చేయడానికి యత్నించి అదుపు తప్పి ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 కాగా, సోమశేఖర్ వివాహం జరగి కేవలం మూడు నెలలు మాత్రమే అవుతుంది. వీరిద్దరి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement