‘ఆంగ్లభాషలో చదువుకోవడం వల్లే ఉన్నత స్థాయికి వచ్చా’

Varaprasad Rao Questions To TDP MLAs Over English Medium - Sakshi

సాక్షి, అమరావతి: ఆంగ్ల విద్యపై ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా? అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంగ్ల భాషను తీసుకురావడం వల్ల అణగారిన వర్గాల్లో నూతనోత్తేజం వచ్చిందన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఆంగ్ల విద్యా విధానం తీసుకురావడం శుభపరిణామం. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నేను ఆంగ్ల భాషలో చదువుకోవడం వల్లే ఉన్నతస్థాయికి వచ్చానని గర్వంగా చెబుతున్నా. రిటైర్డ్‌ ఐఏఎస్‌, మాజీ ఎంపీగా ఆంగ్ల భాషలో పట్టు ఉండటం వల్లే నేను మంచి పేరు సంపాదించా’నని ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top