అకాల వర్షాలతో 11 మంది మృతి | Unseasonal rain claims 11 lives in AP | Sakshi
Sakshi News home page

అకాల వర్షాలతో 11 మంది మృతి

May 12 2014 5:25 PM | Updated on Sep 2 2017 7:16 AM

అకాల వర్షాలతో 11 మంది మృతి

అకాల వర్షాలతో 11 మంది మృతి

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు 11 ప్రాణాలను బలిగొనగా, 20 లక్షల హెక్టార్లకు పైగా పంటలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయి.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు 11 ప్రాణాలను బలిగొనగా, 20 లక్షల హెక్టార్లకు పైగా పంటలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయి. తమిళనాట మొదలైన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

పగలు, రాత్రి తేడా లేకుండా ఎడా పెడా వర్షం కురవడంతో పాకలు కూలిపోయాయి. పిడుగు పాటు మరికొన్ని ప్రాణాలను బలిగింది. అధికారుల లెక్కల ప్రకారమే భారీ వర్షాల వల్ల 11 మంది మరణించారు. పశు సంపదకు కూడా భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. 36,380 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా పాడైనట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement