ఎవరూ ఊహించనది జరిగింది: బాబు

ఎవరూ ఊహించనది జరిగింది: బాబు - Sakshi


హైదరాబాద్ : ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారం చేపడుతుందని ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి దానికీ ఓ టైం ఉంటుందని, ఎన్నికల్లో అలా తనకు టైం కలిసొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, అప్పటివరకూ హైదరాబాద్లోనే ఉంటానని బాబు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఆయన నిన్న కర్నూలులో విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుకు  కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కంటే ఆంధ్రప్రదేశ్పై తనకే ఎక్కువ అవగాహన ఉందన్నారు.విజయవాడ, గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుందని, భూముల సేకరణ పెద్ద సమస్యకాదని చంద్రబాబు అన్నారు. సేకరించిన భూములను అభివృద్ధి చేసి ప్రభుత్వం, భూయజమానికి 60:40 నిష్పత్తిలో పంచుతామన్నారు. వ్యవసాయ భూములను రాజధానికి వాడుకున్నా ఆహారోత్పత్తులపై ప్రభావం ఉండదని, కృష్ణా డెల్టాలో వాడుకునే నీటిని రాయలసీమకు మళ్లించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే సమతుల్యం అవుతుందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top