హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి | Two killed in accident on the highway | Sakshi
Sakshi News home page

హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

Mar 16 2016 5:12 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారి మధ్యలో విజయవాడ వైపు వెళ్లే మార్గంలో డివైడర్‌పై ఉన్న మొక్కలకు నీళ్ల ట్యాంకర్ సాయంతో ఓ కూలీ నీరు పెడుతున్నాడు. అదే సమయంలో వచ్చిన ఓ ట్రాలీ నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్‌తోపాటు, నీరు పెడుతున్న కూలీ కూడా మృతి చెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement