ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర‍్మరణం

పుల‍్లంపేట (వైఎస్సార్‌ జిల్లా) : వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం, రెడ్డి పల్లి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండురుకు చెందిన కొందరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి, వస్తుండగా వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు, కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top