దుర‍్గమ‍్మకు టీటీడీ పట్టువస్త్రాలు | TTD offers silk robes to Durgamma | Sakshi
Sakshi News home page

దుర‍్గమ‍్మకు టీటీడీ పట్టువస్త్రాలు

Sep 21 2017 11:27 AM | Updated on Sep 22 2017 10:02 AM

దుర‍్గమ‍్మకు టీటీడీ పట్టువస్త్రాలు

దుర‍్గమ‍్మకు టీటీడీ పట్టువస్త్రాలు

విజయవాడ కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు.

విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ బృందం గురువారం ఉదయం దుర్గగుడికి చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ జేఇఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డాలర్ శేషాద్రి తదితరులు అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలను సమర్పించారు.
 
ఈ సందర్భంగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ దుర్గా నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రతిఏటా టీటీడీ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ గా వస్తోందని, దానిలో భాగంగా వస్త్రాలను అందచేశామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement