'ఒక్క నిమిషం'పై రేపు నిర్ణయం | toll free number for ap eamcet students | Sakshi
Sakshi News home page

'ఒక్క నిమిషం'పై రేపు నిర్ణయం

May 7 2015 8:03 PM | Updated on Mar 23 2019 8:57 PM

ఒక్క నిమిషం నిబంధన సడలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు.

కాకినాడ: ఒక్క నిమిషం నిబంధన సడలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒక్క నిమిషం నిబంధన సడలించాలని అనేక వినతులు వచ్చాయని వెల్లడించారు. దీనిపై శుక్రవారం ఉదయం నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష అనుమతించలేదు. ఇంజనీరింగ్‌కు రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్/అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

కాగా ఎంసెట్ విద్యార్థులకు రవాణా సౌకర్యం ఇబ్బంది ఎదురైతే పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లో తెలిపారు. విద్యార్థులు 18004256755 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement