నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం | today ysrcp Review meeting | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం

Jun 1 2014 3:18 AM | Updated on May 25 2018 9:17 PM

నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం - Sakshi

నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం

జిల్లాకు సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని పీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్లో...

తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: జిల్లాకు సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని పీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్లో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగే సమావేశానికి పరిశీలకులుగా నియమితులైన జ్యోతులనెహ్రూ, బీ.గురునాథరెడ్డి, ఎం.శంకరనారాయణ హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెలిచిన వారు, ఓడిన అభ్యర్థులు, జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు (గెలిచిన వారు, ఓడిన వారు) సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement