
నేడు వైఎస్ జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గన్నవరం రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గన్నవరం రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుం టారని, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోని యద్దనపూడికి వెళతారని చెప్పారు. దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్‌కు పయనమవుతారని చెప్పారు. - సాక్షి, విజయవాడ