పోలీసుల కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మృతి | Three red sandalwood smugglers killed in police firing in chittoor district | Sakshi
Sakshi News home page

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మృతి

Jan 29 2014 3:25 PM | Updated on Aug 21 2018 7:18 PM

చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు.

 చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. భాకరాపేట పులిబోను గుట్ట అటవీ ప్రాంతంలో భారీగా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారన్న సమాచారాన్ని పోలీసు బుధవారం అందుకున్నారు. దాంతో పోలీసులు హుటాహుటిన భాకరాపేట పులిబోను గుట్ట చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయాన్ని స్మగ్లర్లు పసిగట్టి పోలీసులపై రాళ్లు, కత్తులతో దాడికి తెగబడ్డారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైయ్యారు.

 

స్మగ్లర్లపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ముగ్గురు స్మగ్లర్లు మరణించారు.  ఇటీవల చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులపై తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేసి చంపారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement