ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి | Three people killed in tractor overturns at kurnool district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి

Mar 7 2014 11:32 AM | Updated on Sep 2 2017 4:27 AM

కర్నూలు జిల్లా గడివేముల మండలం ఇందుట్ల గ్రామ సమీపంలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడింది.

కర్నూలు జిల్లా గడివేముల మండలం ఇందుట్ల గ్రామ సమీపంలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడిన కూలీలలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ వేగంగా ట్రాక్టర్ను నడపడం వల్లే ఆ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement