అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం రూపొందించిన ....
హైదరాబాద్ : అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలు చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ ముగ్గురు ఐఏఎస్ అధికారులు శుక్రవారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా మార్గదర్శకాలు ఉన్నాయంటూ వారు క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ను ఆశ్రయించిన వారిలో ఐఏఎస్లు అనంతరామ్ (ఆంధ్రప్రదేశ్), హెచ్ఎస్ రావత్ (ఆంధ్రప్రదేశ్), హరికిరణ్ (తెలంగాణ రాష్ట్రం) ఉన్నారు.