ఇద్దరు సైంటిస్టులకు నాయుడమ్మ అవార్డు

ఇద్దరు సైంటిస్టులకు నాయుడమ్మ అవార్డు


అవార్డు అందుకోనున్న టెస్సీ థామస్, గీతా వరదన్తెనాలి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట వార్షికంగా అందించే ప్రతిష్టాత్మక అవార్డుకు ఇద్దరు మహిళా శాస్త్రవేత్తల్ని ఎంపిక చేశారు.  2014 సంవత్సరానికిగాను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డెరైక్టర్ డాక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ గీతా వరదన్‌లను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో వెల్లడించారు. నాయుడమ్మ స్వస్థలమైన తెనాలిలో మార్చి 1వ తేదీ సాయంత్రం నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంలో అవార్డు ప్రదానోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా టెస్సీథామస్ ‘రక్షణరంగ అవసరాలు-చొరవ-భారత్ సంసిద్ధత’ అంశంపైనా, గీతా వరదన్ ‘దేశ అవసరాలు-రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ’ అంశంపైనా నాయుడమ్మ స్మారకోపన్యాసం చేస్తారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top