రోగులపై సమ్మెట | The medical and health staff strike across the district | Sakshi
Sakshi News home page

రోగులపై సమ్మెట

Sep 26 2013 2:40 AM | Updated on Oct 9 2018 7:52 PM

సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం రోగులపైనా తీవ్రంగా ఉంటోంది. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బంది సమ్మెలో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు.

 అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం రోగులపైనా తీవ్రంగా ఉంటోంది. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బంది సమ్మెలో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో సమ్మె ప్రభావం మరీ ఎక్కువగా ఉంది.
 
 ఇక్క డ వైద్యులు, మినిస్టీరియల్ సిబ్బంది, చివరకు కాంట్రాక్టు ఉద్యోగులు సైతం సమ్మె బాట పట్టారు. దీనివల్ల  వైద్య సేవలు మృగ్యమవుతున్నాయి. బుధవారం ఆస్పత్రి రోగులతో కిక్కిరిసింది. ప్రధానంగా ఓపీ విభాగంలో భారీ రద్దీ కన్పించింది. బాలింతలు, గర్భిణులు, మహిళలు తమ పిల్లలను ఎత్తుకుని  క్యూలో గంటల కొద్దీ నిరీక్షించారు. సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైద్యుల సంఘం  ప్రతి రోజూ ఉదయం తొమ్మి ది నుంచి 10 గంటల వరకు ఓపీ సేవలను బహిష్కరిస్తోంది.
 
 దీనివల్ల రోగు లు ముందుగా ఓపీ చీటీలు తీసుకున్నా  గంటల కొద్దీ వేచివుండక తప్పడం లేదు. ఈ క్రమంలో కొందరు క్యూలోనే సొమ్మసిల్లిపోతున్నారు. ప్రస్తుతం విషజ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారు. దీంతో ఓపీ నంబర్ 2, 3లలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడ రోగులకు చికిత్స చేసేందుకు ఐదుగురు వైద్యులు కూడా లేరు. దీంతో భారమంతా ఆస్పత్రి సూపరింటెండెంట్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, అసోసియేట్ ప్రొఫెసర్‌లు భీమసేనాచార్, మోహన్‌రావు తదితరులపై పడుతోంది. ఓపీ పూర్తయ్యేలోపు మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది. ఇక ఓపీ నంబర్ -6లో గర్భిణుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ఒక వైద్యురాలిని మాత్రమే అందుబాటులో ఉంచా రు. ఆమె అన్నీ చూసుకోవాల్సి వస్తోం ది. వాస్తవంగా ఆస్పత్రిలో అత్యధిక సంఖ్యలో వైద్యులుండే యూనిట్  గైని క్ వార్డే. అయితే, వైద్యులు సమ్మె బాట పట్టడంతో  ఓపీ సేవలు ఆలస్యమవుతున్నాయి. సీజనల్ వ్యాధుల ప్రభా వం వల్ల వైద్య పరీక్షలకు సైతం భారీ సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఈ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులు సైతం తక్కువ సంఖ్యలో ఉండడంతో సకాలంలో వైద్యపరీక్షలు పూర్తి కావడం లేదు.
 150 మంది చిన్నారులు...
 
 ముగ్గురు సిబ్బంది
 ఇమ్యునైజేషన్ విభాగంలో తక్కువ సిబ్బంది కారణంగా వైద్యసేవల్లో జాప్యం జరుగుతోంది. బుధవారం రోజున టీకాలు వేస్తుండడంతో 150 మందికిపైగా  చిన్నారులను తీసుకొస్తున్నారు. వీరికి సూపర్‌వైజర్, ఇద్దరు ఏఎన్‌ఎంలు మాత్రమే టీకాలు వేయాల్సి వస్తోంది. దీనివల్ల గంటల కొద్దీ ఆలస్యమవుతోంది. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోనే పరిస్థితి ఇలా వుంటే... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీలు)లో ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ సేవలు మరింత నామమాత్రంగా ఉండడంతో అధిక శాతం మంది  జిల్లా కేంద్రానికి వస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement