వృద్ధ దంపతుల ఆత్మహత్య | The elderly couple had committed suicide | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల ఆత్మహత్య

Mar 20 2016 3:21 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఓ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకుంది.

తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వారి ఇద్దరు కుమారులూ కాదనుకున్నారు. దీన్ని తట్టుకోలేక ఓ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ముమ్మిడివరం పట్టణానికి చెందిన అనుపిండి వెంకట శాస్త్రి (60), అనుపిండి లక్ష్మి (55) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

వృద్ధాప్యంలో వారు తమను పట్టించుకోకపోవడంతో శాస్త్రి, లక్ష్మి మనస్తాపం చెందారు. రావులపాలెం ప్రభుత్వ కళాశాల మైదానానికి వచ్చి పురుగుల ముందు సేవించి స్పృహ తప్పిపడిపోయారు. ఆదివారం ఉదయంస్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిద్దరినీ కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మధ్యాహ్న సమయంలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement