చెరువులో పడి చిన్నారి మృతి | The death of the young boy lying in the pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి చిన్నారి మృతి

Nov 14 2015 7:59 PM | Updated on Sep 17 2018 8:02 PM

సరదాగా చెరువులోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు.

సరదాగా చెరువులోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చంబుకూరు పంచాయతి బలిజపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భరత్‌కుమార్(4) అనే చిన్నారి తండ్రితో పాటు చెరువు వద్దకు వెళ్లాడు. తండ్రి గొర్లను మేపుతున్న సమయంలో సరదాగా ఆడుకుంటున్న చిన్నారి చెరువులోకి దిగిగాడు. చెరువులో లోతైనగుంట ఉండటంతో.. అందులో మునిగి పోయాడు. ఇది గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసే ప్రయత్నం చేసేలోపే.. అతడు ప్రాణాలు కోల్పోయాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement