రోడ్డుపై ధర్నా చేస్తే కేసులే | The case the first row on the road | Sakshi
Sakshi News home page

రోడ్డుపై ధర్నా చేస్తే కేసులే

Jan 21 2014 5:42 AM | Updated on Aug 30 2018 5:35 PM

అనుమతి లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ధర్నాలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఎ.వి.రంగనాథ్ హెచ్చరించారు.

ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలి గిస్తూ ధర్నాలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఎ.వి. రంగనాథ్ హెచ్చరించారు. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో 25వ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా వార్సోవాలు ప్రతి నిత్యం నిర్వహిం చాలని, అప్పడే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చని అన్నా రు. రోడ్డు భద్రతలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటించాలన్నారు. భద్రత గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొం దరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చె ప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించడంతో పాటు వాహనదారులంతా లెసైన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
 
 అందుకోసమే గత ఏడా ది జిల్లాలో వాహనాల తనిఖీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ డ్రైవ్ ద్వారా అపరాధ రుసుం కింద ప్రభుత్వానికి రూ.3 కోట్లు వచ్చాయన్నారు. మళ్లీ మంగళవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, వాహనదారులు లెసైన్స్, ఇన్సూరెన్స్‌తోపాటు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. మద్యం తాగి రోడ్డుపై వాహనాలు నడి పేవారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో త్వరలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నామని చెప్పా రు. ప్రమాదరహిత జిల్లాగా తీర్చి దిద్దేం దుకు అన్ని శాఖల సహకారంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా రోడ్డు భద్ర తా వారోత్సవాల కరపత్రాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీవో మోహిమిన్, డీఎస్పీ బాలకిషన్, ఏవో కృష్ణారెడ్డి, ఎంవీఐలు ఎస్.ఈశ్వరయ్య, ధనరాజ్ బజాజ్, సీఐలు సారంగపాణి, రామోజు రమేష్, ఏఎంవీఐలు శ్రీని వాస్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement