మోదీ ప్యాకేజీ ఎంతో అభినందించతగ్గది

TG Venkatesh Comments Over PM Modi 20 Lakh Crore Package - Sakshi

సాక్షి, కర్నూలు : భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ ఎంతో అభినందించతగ్గదని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 10 శాతం ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్యాకేజీలు కేటాయించడం గొప్ప విషయమన్నారు. ఈ ప్యాకేజీ వల్ల స్వయం ఆధారిత భారతదేశం ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. రైతులకు తమ ఆదాయాన్ని రెట్టింపు చేస్తూనే, పేద వర్గాలకు కూడా సహాయం అందించే ప్యాకేజీ అని అన్నారు. చిన్నతరహా పరిశ్రమలకు చేయూతను ఇస్తూనే, భారత్‌లో తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సులభమైన రుణ సదుపాయాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top