పదిశాతం కమీషన్‌ను రద్దుచేస్తాం: మంత్రి | Ten percent commission will be canceled | Sakshi
Sakshi News home page

పదిశాతం కమీషన్‌ను రద్దుచేస్తాం: మంత్రి

Nov 12 2015 3:13 PM | Updated on Aug 30 2019 8:37 PM

చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో రైతు ఉత్పత్తుల కొనుగోలు చేసేందుకు వ్యాపారులు 10 శాతం కమీషన్ ఇవ్వటాన్ని రద్దు చేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో రైతు ఉత్పత్తుల కొనుగోలు చేసేందుకు వ్యాపారులు 10 శాతం కమీషన్ ఇవ్వటాన్ని రద్దు చేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఆయన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో పర్యటించారు. భారీ వర్షాల తర్వాత పొలాలను, చెరువుల పరిస్థితిని  పరిశీలించారు.

అనంతరం ఆయన మార్కెట్ యార్డులో అధికారులు, రైతులతో సమావేశమయ్యారు. ఎక్కడా లేని విధంగా మదనపల్లె మార్కెట్‌లో పదిశాతం దోపిడీ సాగుతోందని  రైతులు ఆయన దృష్టికి తీసుకు వ చ్చారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాలోని ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాల నుంచి 6.50 ఎకరాలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మదనపల్లె మార్కెట్‌ను మరింత ఆధునీకరించటంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement