breaking news
pattipati pullaravu
-
ని‘శబ్దం’ అతని ఆయుధం
అందరికీ ఆయుధాలు కత్తో, కొడవలో అయితే అతని ఆయుధం మాత్రం నిశబ్దం. ఎందుకంటే.. మూగవాడు కనుక. నారా రోహిత్ తదుపరి సినిమా ‘శబ్దం’లో మూగవాడి పాత్రలో కనిపించనున్నారు. పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మించనున్నారు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్‌నిచ్చారు. పి.బి.మంజినాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం టీమ్ అంతా కష్టపడతాం. ఈ కథకు ‘శబ్దం’ అనే టైటిల్ చాలా యాప్ట్’’ అన్నారు. ‘‘శబ్దం’ సూపర్ హిట్ అవ్వాలని, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ‘‘రోహిత్‌గారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నారాయణరావు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన హీరో రోహిత్, నిర్మాతలకు థ్యాంక్స్. ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’అన్నారు మంజునాథ్. -
పదిశాతం కమీషన్‌ను రద్దుచేస్తాం: మంత్రి
చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో రైతు ఉత్పత్తుల కొనుగోలు చేసేందుకు వ్యాపారులు 10 శాతం కమీషన్ ఇవ్వటాన్ని రద్దు చేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఆయన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో పర్యటించారు. భారీ వర్షాల తర్వాత పొలాలను, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన మార్కెట్ యార్డులో అధికారులు, రైతులతో సమావేశమయ్యారు. ఎక్కడా లేని విధంగా మదనపల్లె మార్కెట్లో పదిశాతం దోపిడీ సాగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకు వ చ్చారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాల నుంచి 6.50 ఎకరాలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మదనపల్లె మార్కెట్‌ను మరింత ఆధునీకరించటంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.