బాబు వస్తున్నారని...

బాబు వస్తున్నారని... - Sakshi


తాత్కాలిక మర మ్మతులతో హడావుడి

 

పీఎన్‌కాలనీ: పట్టణమంతా ఒకటే హడావుడి.. ఎక్కడ చూసినా మరమ్మతులు పనులు చకచకా సాగి పోతున్నాయి. వీధి లెట్లు, ప్రధాన రోడ్లకు మరమ్మ తులు, వీధులు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య నిర్వ హణ,  డివైడర్లు, రోడ్ల పక్క ఉన్న పిచ్చి మొక్కలు తొల గించడం, కలుపును తీయడం ఒక్కటేమిటి.. అడగక్క ముందే అన్నీ చేస్తున్నారు.  ఇది చూసిన పట్టణ ప్రజలు ఔరా! ఇదేమిటి అనుకుంటూ ఆశ్చర్యపడుతున్నారు.  ఈ హడావుడి అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండడంతోనే అని తెలుసుకుని ఔరా అని  అనుకుంటున్నారు. వర్షం కురిస్తే చాలు పట్టణంలో  పైన పటారం..  లోన లొటారం అన్న చందంగా  కనిపి స్తుంది.  

 

సమస్యలతో పట్టణ ప్రజలు నిత్యం కొట్టు మిట్టాడుతున్నా అధికారులో చలనం కూడా కనిపించేదికాదు. ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.  సీఎం వస్తున్నారంటే మాత్రం ఇప్పు డు చక చకా పనులు వాయువేగంగా చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.  పట్టణంలో చిన్నపాటి వర్షం కురిసినా పట్టణమంతా జలమయం అవుతుంది. ఎక్కడిక్కడే గోతులు ఏర్పడి వర్షం పడితే ప్రజల గుండెల్లో ైరె ళ్లు పరిగెడతాయి.  పట్టణంలో పలు ప్రాంతాల్లో వీధిలైట్లు లేక, మరికొన్నిచోట్ల లైట్లు ఉన్నా వెలగక అంధకారంలో ఉన్నా పట్టించుకోని అధికారులు మాత్రం సీఎం వస్తున్నారని మెహర్బాణీ కోసం విద్యుత్ వెలుగులు విరజిమ్మే విధంగా చర్యలు చేపడుతుం డడంతో పట్టణ వాసుల నుంచి విమర్శలొస్తున్నాయి.

 

ప్రధానరోడ్లలో  డివైడర్ల మధ్య ఇప్పుడుమాత్రం నాయకుల మెప్పు కోసం చకచకా మరమ్మతు పనులు చేస్తున్నారు. పట్టణంలో పలు కాలనీల రోడ్లు, కాలువల్లో చెత్తాచెదారం, మురుగునీరు పేరుకు పోయిన  విషయాన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడుమాత్రం చెప్పకుండానే పారిశుద్ద్య పనులు సకాలంలో చేపడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  పట్టణాన్ని పరిశుభ్రం చేసేం దుకు రోజు పనిచేసే కార్మికులకు అదనంగా పారిశుద్ధ్య కార్మికులను తెచ్చి మరీ పనులు చేపడుతున్నారు. ఇదే తాపత్రయం ఎల్లవేలలా ఉంటే ఇప్పుడు ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం వచ్చేది కాదని పలువురు పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు.  అధికారులు  నాయకుల మన్ననలు పొందాలని ఉన్నంత తాపత్రయం ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top