సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్రా కశ్మీర్‌గా పేరుపొందిన విశాఖ మన్యంలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. లంబసింగి-3, చింతపల్లి-4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మన్యం ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. అలాగే... ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు దట్టంగా అలుముకుంటోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఉదయం సమయంలో కూడా లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రస్తుతం ఒక్కసారిగా పడిపోవడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.