గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం లంగర్ హౌస్లోని బాపూ ఘాట్‌లో నివాళలర్పించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎదుట తెలంగాణ ఆందోళనకారులు నిరసన తెలిపారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణావాదులు షాక్ ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం లంగర్ హౌస్లోని బాపూ ఘాట్‌లో నివాళలర్పించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎదుట తెలంగాణ ఆందోళనకారులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
మరోవైపు అసెంబ్లీలోని సచివాలయంలో గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్ అంజలి ఘటించారు. ఇక గాంధీ భవన్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ...జాతిపితకు నివాళులు అర్పించారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కూడా గాంధీజీకి నివాళులు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.