అసెంబ్లీ ప్రోరోగ్పై గవర్నర్ను కలిసిన టి.మంత్రులు | Telangana ministers meet Governor over assembly prorogue | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ప్రోరోగ్పై గవర్నర్ను కలిసిన టి.మంత్రులు

Nov 26 2013 5:17 PM | Updated on Sep 2 2017 1:00 AM

అసెంబ్లీ ప్రోరోగ్ అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను సోమవారం తెలంగాణ మంత్రులు కలిశారు.

హైదరాబాద్: అసెంబ్లీ ప్రోరోగ్ అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను సోమవారం తెలంగాణ మంత్రులు కలిశారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయొద్దంటూ వారు గవర్నర్కు విన్నవించారు. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలంటూ సీఎంఓ కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.  దీఅసెంబ్లీ ప్రోరోగ్ అయితేనే ఆర్డినెన్సుల జారీకి వీలుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ  ప్రకటనలో తెలిపింది. ప్రోరోగ్ అనేది పాలనాపరమైన అంశమని, అంతేతప్ప ఇందులో రాజకీయాలు, దురుద్దేశాలు ఏమీ లేవని వివరించింది. కాగా తెలంగాణ మంత్రులు మాత్రం అసెంబ్లీ ప్రోరోగ్ వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే టీ.మంత్రులు గవర్నర్ ను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement