ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న టీ.ఎంపీలు | Telangana congress MPs obstruct Undavalli Arun Kumar speech | Sakshi
Sakshi News home page

ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న టీ.ఎంపీలు

Sep 5 2013 12:01 PM | Updated on Mar 9 2019 3:59 PM

ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న టీ.ఎంపీలు - Sakshi

ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న టీ.ఎంపీలు

సీమాంధ్రలో ఉదృతంగా సాగుతోన్న సమైక్య ఉద్యమాన్ని గురించి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గురువారం లోక్సభలో ప్రస్తావించారు.

న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఉదృతంగా సాగుతోన్న సమైక్య ఉద్యమాన్ని గురించి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గురువారం లోక్సభలో ప్రస్తావించారు.  ఆయన తన ప్రసంగంలో ముల్కీ నిబంధనల అంశాన్ని ప్రస్తావించడంపై  తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రసంగాన్ని వారు అడ్డుకున్నారు.

సీమాంధ్ర ఉద్యమం దేశంలోనే పెద్దదని ఉండవల్లి అన్నారు. రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని విడదీయటం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ నేపథ్యంలో సభ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుండటంతో టి కాంగ్‌ ఎంపీలను కూర్చోవాలని స్పీకర్‌ మీరాకుమార్ కోరారు. దీంతో గొడవ సద్దు మణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement