సీపీఎస్‌ వద్దే వద్దు | Teachers Protest CPS Cancel Kurnool | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ వద్దే వద్దు

Aug 6 2018 7:37 AM | Updated on Aug 6 2018 7:37 AM

Teachers Protest CPS  Cancel Kurnool - Sakshi

ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

ఆదోని అర్బన్‌: కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు నినదించారు. ఆదివారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఢణాపురం నుంచి ఆదోని ఆర్ట్స్‌ కళాశాల వరకు బైకు, జీపుజాత, ర్యాలీ  నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ బాబురెడ్డి, సెక్రటరీ హృదయరాజు మాట్లాడారు. సీపీఎస్‌ రద్దుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ జాప్యం చేస్తున్నారన్నారు. సీపీఎస్‌ కారణంగా  రిటైర్‌మెంట్‌ తర్వాత ఉద్యోగులు పింఛన్‌ భద్రతను కోల్పోతున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ ఆర్‌డీఏ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం 653, 654, 655 జీఓలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ సమస్య పరిష్కరించేంత వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు  చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 1న సామూహిక సెలవు పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  ఫ్యాప్టో నాయకులు తిమ్మన్న, సురేష్‌కుమార్, రామశేషయ్య, మాణిక్య రాజు, రంగన్న, నర్సింహులు, సోమశేషాద్రిరెడ్డి, ప్రేమ్‌ కుమార్, క్రిష్ణ, రఘు, జయరాజు, హనుమంతు, నాగురాజు, సునీల్‌కుమార్, క్రిష్ణమూర్తి, ఉరుకుందప్ప, రమేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement