రూ.1.40 వేలు మాయం!

Teacher Loses One Lakh in ATM Withdrawals - Sakshi

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

లబోదిబోమంటున్న ఉపాధ్యాయుడు

శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్‌: ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టి ఆదర్శ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న మిత్తన నిమ్మయ్య ఈ నెల 6న ఇచ్ఛాపురం ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లి రూ.20 వేలు విత్‌ డ్రా చేశారు. సొమ్ము వచ్చినట్లు శబ్ధం వచ్చినప్పటికీ డబ్బులు రాలేదు. ఆయన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800112211కు ఫోన్‌ చేయడంతో పాటు స్థానిక ఎస్‌బీఐ మేనేజర్‌కు సమాచారం అందించారు. అదే రోజు రాత్రి మరలా బ్యాంకు ఖాతాలో రూ.20వేలు చేరినట్లు మేసేజ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అక్కడకు మూడు రోజుల అనంతరం 10వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో వరుసగా రూ.20వేలు, రూ.40వేలు, రూ.20వేలు, రాత్రి 12 తర్వాత రూ.40వేలు మొత్తం రూ.1లక్షా 40వేలు విత్‌ డ్రా అయినట్లు వచ్చిన మెసేజ్‌ను ఉదయం చూసి అవాక్కయ్యారు. ఈ సొమ్మును రాజస్తాన్‌ రాష్ట్రంలో ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసినట్లు మేసేజ్‌ రావడంతో మరలా బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించడంతోపాటు ఈ నెల 17న ఇచ్ఛాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేటికి వారం రోజులు కావస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో సోమవారం ఆయన విలేకరులను ఆశ్రయించి తన గోడును వెళ్లబుచ్చారు. తన సొమ్మును తనకు ఇప్పించాలంటూ ఆయన బ్యాంకు, పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top