బద్ధలవుతున్న టీడీపీ కంచుకోటలు | TDP leaders join YSRCP | Sakshi
Sakshi News home page

బద్ధలవుతున్న టీడీపీ కంచుకోటలు

Sep 19 2018 12:40 PM | Updated on Oct 29 2018 8:24 PM

TDP leaders join YSRCP - Sakshi

సోమల; సోమల మండలంలో టీడీపీకి చెందిన పలు కుటుంబాల వారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. చిన్న ఉప్పరపల్లెకు చెందిన టీడీపీ నేతలు వేణుగోపాల్, మల్లికార్జున, సిద్దయ్య, మురళీతో పాటు 10 కుటుంబాలు, నంజంపేట గొల్లపల్లెకు చెందిన మునిరాజ, వెంకటరమణ, సుధాకర, రెడ్డెప్ప, రామూర్తి, సుబ్రమణ్యం, రమణ, మల్లికార్జున, గంగాధర, శేఖర్, రెడ్డెప్ప, విజయ్, భార్గవ్, శివ, శేషు, చెంగయ్యతో పాటు 20 కుటుంబాలు, సరస్వతీ పురంలో మహేష్‌నాయుడు, జగదీష్‌తో పాటు మూడు కుటుంబాలు వైఎస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వంద మంది నాయకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. సింగిల్‌విండో అధ్యక్షు డు వెంకటేశ్వరరావు, ఝూన్సీలక్ష్మీ, శ్రీనివాసులు, వెంకట్రామనాయుడు, మహేష్‌నాయుడు, శీలం. గణేష్, హరినాథ్, ఖయ్యీం, జిన్నా, అమాస. మోహన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

నవరత్నాలతో ప్రతి ఇంటికీ లాభం
నవరత్నాల పథకాలతో ప్రతి ఇంటికీ లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమల మండలంలో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమాన్ని మంగళవారం 81 చిన్న ఉప్పరపల్లె, పొదలకుంట్లపల్లె, నంజంపేట, ఎస్‌. నడింపల్లె పంచాయతీలలో మండల పార్టీ అధ్యక్షుడు గంగాధరం రాయల్, పార్టీ జిల్లా కార్యదర్శి శీలం భాస్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే నవరత్నాలు కరపత్రాలు ప్రజలకు అందజేస్తూ వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement