ఉప ఎన్నికలో గెలిపిస్తే రౌడీషీట్‌ ఎత్తేస్తాం | TDP Bumper Offer in nandyal by election | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలో గెలిపిస్తే రౌడీషీట్‌ ఎత్తేస్తాం

Jul 7 2017 2:50 AM | Updated on Oct 19 2018 8:10 PM

ఉప ఎన్నికలో గెలిపిస్తే రౌడీషీట్‌ ఎత్తేస్తాం - Sakshi

ఉప ఎన్నికలో గెలిపిస్తే రౌడీషీట్‌ ఎత్తేస్తాం

కర్నూలు జిల్లా నంద్యాలలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలవడానికి అధికార పార్టీ నిర్లజ్జగా అన్ని అడ్డదారులు తొక్కుతోంది.

తెలుగుదేశం బంపర్‌ ఆఫర్‌
నంద్యాలలో గెలిచేందుకు అడ్డదారులు
రౌడీషీట్‌పై నారా లోకేశ్‌తో మాట్లాడతానన్న  సోమిశెట్టి


నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలవడానికి అధికార పార్టీ నిర్లజ్జగా అన్ని అడ్డదారులు తొక్కుతోంది. తాజాగా టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తే రౌడీషీటర్లపై రౌడీషీట్‌లను తొలగిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం రౌడీషీటర్లకు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.  పట్టణంలోని ఓ హోటల్‌లో బుధవారం టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది.

 ఈ సందర్భంగా మాజీ మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం జరిగిన ఘర్షణలో పోలీసులు కొందరు యువకులపై కేసులు పెట్టి రౌడీషీట్‌ తెరిచారని, వాటిని తొలగించాలని కోరారు. దీనిపై సోమిశెట్టి స్పందిస్తూ మంత్రి నారా లోకేశ్‌ త్వరలోనే నంద్యాలలో పర్యటిస్తారని అప్పుడు ఆయనతోఈ విషయం చర్చిస్తామని చెప్పారు. రౌడీషీట్‌ తొలగింపునకు ఏటా డిసెంబర్‌లో జాబితాను రూపొందిస్తారని, అప్పుడు పేర్లను తొలగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement