దళిత సర్పంచులను వేధిస్తున్న టీడీపీ నేతలు | TDP abuse of Dalit leaders sarpanch | Sakshi
Sakshi News home page

దళిత సర్పంచులను వేధిస్తున్న టీడీపీ నేతలు

Apr 23 2016 1:08 AM | Updated on Aug 10 2018 8:16 PM

దళిత వర్గాలకు చెందిన సర్పంచులపై పచ్చ తమ్ముళ్ల వేధింపులకు పాల్పడుతున్నారని ఈలప్రోలు ...

ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ల సంఘం జిల్లా కార్యద ర్శి మిర్యాల చినరామయ్య

 

ఈలప్రోలు(ఇబ్రహీంపట్నం):  దళిత వర్గాలకు చెందిన సర్పంచులపై పచ్చ తమ్ముళ్ల వేధింపులకు పాల్పడుతున్నారని ఈలప్రోలు సర్పంచ్, ఎస్సీ, ఎస్టీ సర్పంచుల సంఘం జిల్లా కార్యదర్శి మిర్యాల చినరామయ్య ఆరోపించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. రాష్ట్రంలో దళిత సర్పంచులు ఎక్కువగా ఉన్నందున వారిని రాజకీయంగా అణగదొక్కటానికి గ్రామ, మండల స్థాయిలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారన్నారు.


సర్పంచ్‌ల అధికారాలకు కత్తెర!
గ్రామంలో కనీసం పింఛన్ ఇప్పించే అర్హత సర్పంచులకు లేకుండా ఈప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎస్‌ఆర్ గ్రాంటు, ఉపాధి పనులు గ్రామంలో జరుగుతున్నా కనీసం సర్పంచ్‌కి తెలపటం లేదన్నారు. పార్టీ మారుతున్నట్లు టీడీపీ నాయకులే పనికట్టుకుని చేస్తున్నారని చెప్పారు. మునిగే పడవలో ఎక్కాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. వైఎస్సార్ సీపీని వీడేది లేదని ఎల్లప్పుడూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ అడుగుజాడల్లో పనిచేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement